Tuesday, November 26, 2024

ఉద్యమంలా మట్టి సంరక్షణ.. హైదరాబాద్‌లో సైక్లింగ్‌, డెకాథ్లాన్‌

హైదరాబాద్‌: ఈశా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సద్గురు చేపట్టిన మట్టి సంరక్షణ ఉద్యమంలో భాగంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. భూమిపై మట్టిని సేంద్రియ పదార్థాలతో మళ్లీ సారవంతంగా మార్చే లక్ష్యంతొ ఈ ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లో మూడు ప్రాంతాలలో వివిధ కార్యక్రమాల్లో యువత పాల్గొన్నారు. గచ్చిబౌలి, కొంపెల్లి, నెక్లస్‌రోడ్‌లో సైక్లింగ్‌, డెకాథ్లాన్‌ వంటి కార్యక్రమాల్లో వందలమంది పాల్గొన్నారు. డెకాథ్లాన్‌లో ఈవెంట్‌ను హైదరాబాద్‌ సైకిల్‌ గ్రూప్ (హెచ్‌సిజి), సేవ్‌ సాయిల్‌ వాలంటీర్లు నిర్వహించారు. 80 మంది సైక్లిస్టులు ఒక్కొక్కరు 40 కిలోమీటర్లు ప్రయాణించారు. అందులో ఏడేళ్ళ చిన్నపిల్లాడు ఎంతో సునాయాసంగా శామీర్‌పేట వరకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు. శామీర్‌పేట్‌లోని ఎక్సలెన్సియా కళాశాల వారు సేవ్‌ సాయిల్‌పై ప్రదర్శనతో పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌బండ్‌ ఈవెంట్‌లో 10 మంది పిల్లలతో సహా 70 మంది పాల్గొన్నారు. ఒక్కొక్కరు 20 కిలోమీటర్లు ప్రయాణించారు. గిటార్‌, డ్రమ్స్‌ మరియు సేవ్‌ సాయిల్‌ గీతంతో వారిని ఉత్సాహపరిచారు. పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌లో 40 మంది, ఒక్కొక్కరు10 కి.మీ. సైక్లింగ్‌ చేశారు. వారిలోగాయనీమణి శ్రీలలిత ఉన్నారు. ఇంకా ఇద్దరు పిల్లలు రక్ష, చైత్ర ఈసమావేశానికిమద్దతుగా సేవ్‌ సాయిల్‌ పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. ఇవాళ ఒక్కరోజే అందరూ కలసి 500 కి.మి. ప్రయాణం పూర్తి చేశారు. కాగా 30 వేల కి.మి. ప్రయాణం లక్ష్యంగా సద్గురు బైక్‌పై బయలుదేరారు. ఆయన జూన్‌ 15నాటికి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంగ్లండ్‌నుండి భారత్‌కు బైక్‌ పై ఆయన వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement