సరిగా తినడం, శ్వాస మెరుగుపరిచే వ్యాయామాలు, యోగా, తరచుగా విక్స్ వాపోరబ్‌తో ఆవిరి పట్టడం వంటి చర్యల ద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చని బాలీవుడ్ సెలబ్రిటీ సోహా అలీఖాన్ తెలిపారు. తన శ్వాస ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంలో అతి చిన్న మార్పులు ఏ విధంగా తోడ్పడ్డాయో సోహా అలీఖాన్ వెల్లడించారు. తన ఆరోగ్య రహస్యం గురించి సోహా మాట్లాడుతూ… నవంబర్ అంటేనే కాస్త ఇబ్బంది పెట్టే నెల అని, అకస్మాత్తుగా వాతావరణం మారుతుంటుందన్నారు. తమ కుటుంబ ఆరోగ్యం పట్ల పూర్తి ఆందోళన కూడా పడుతుంటామన్నారు. అయితే తన ఆందోళనను దూరంగా జరపడంతో పాటుగా తమ కుటుంబమంతటికీ ప్రీతిపాత్రమైనది విక్స్‌వాపోరబ్ అన్నారు.
సాధారణ జలుబు వంటి లక్షణాలతో పాటుగా ఒళ్లు నొప్పులు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఎన్నో తరాలుగా తమ జీవితంలో విక్స్ అంతర్భాగమైందన్నారు. వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటంలో తన శరీరానికి కొంత సమయం అవసరమన్నారు. అయితే తమ కుటుంబంతో సరదాగా గడిపే ఎన్నో ప్రత్యేక సందర్భాలు వచ్చే నెల కూడా ఇదేనని, అందువల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు తాను తమ అమ్మ అడుగు జాడల్లో నడుస్తుంటానన్నారు. విక్స్ వ్యాపోరబ్‌తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్, కర్పూరం, పుదీనా వంటివి వినియోగించడం చేస్తానని తెలిపారు. అంతేకాదు సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామంతో తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్నానని సోహా అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..