గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చత్తీస్గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
బెంగుళూరుకు మరికొన్ని విమానాలు మళ్లింపు
ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.