శాశ్వతంగా నాలా సమస్యలు పరిష్కారం చేయాలని ఎన్ఎన్డీపీ చేపట్టామని.. 12 కిలోమీటర్లు హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే వరద కాల్వ రిటైనింగ్ వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.68 కోట్ల రూపాయలతో కవాడి గూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో వర్షాలు పడిన సమయంలో హుస్సేన్ సాగర్ పొంగి నల్లకుంట, అంబర్ పేట ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. అందువల్ల ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో శాశ్వత పరిష్కారం చేపట్టామన్నారు. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం చేసుకుంటున్నామని.. నాళాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital