జగిత్యాల జిల్లా మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాట్ల కలకలం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులకు పాము కాటుకు గురయ్యారు.నిన్న అఖిల్ ని కాటేసింది .. ఈ రోజు 8వ తరగతి విద్యార్థి యస్విత్ ని కాటేసింది పాము. దీంతో కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు యస్విత్, అఖిల్..
గతంలో ఇదే పాఠశాలలో పాము కాటుకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.