Thursday, December 19, 2024

ADB | పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. ట్రాలీ పట్టివేత

జన్నారం, (ఆంధ్రప్రభ): అక్రమంగా 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం తరలిస్తున్న ఆటో ట్రాలీని ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ బియ్యం విలువ రూ.36 వేలు ఉంటుందని… పిడిఎస్ బియ్యంతో పాటు ట్రాలీని సీజ్ చేశామని మంచిర్యాల టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ తెలిపారు.

బియ్యాన్ని తరలిస్తున్న మండలంలోని మందపల్లికి చెందిన గుర్రాల రాజేందర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం పిడిఎస్ బియ్యంతో పాటు ఆటో ట్రాలీని, నిందితున్ని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement