హైదరాబాద్, ప్రభన్యూస్ : స్కోడా ఆటో ఇండియా తమ అత్యాధునిక డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లో పీపీఎస్ మోటార్స్‌తో కలిసి గచ్చిబౌలి వద్ద ప్రారంభించింది. ఈ నూతన సదుపాయంతో స్కోడా ఆటో ఇండియా హైదరాబాద్‌లో ఉనికిని విస్తరించడంతో పాటుగా నగరంలో మరింత విస్తృతంగా తమ కార్యకలాపాలను నిర్వహిచనుంది. చెక్ ఆటో తయారీదారు, తమ ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రాబోయే ఏడాది 225 టచ్ పాయింట్లకు తమ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పీపీఎస్ మోటార్స్ వ్యూహాత్మకంగా హైటెక్ సిటీ వద్ద ఉంది. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వినియోగదారుల అవస రాలను తీర్చనుంది. దాదాపు 448 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ సదుపాయంలో ఆరు కార్లను సౌకర్యవంతంగా ప్రదర్శించనున్నారు.
వర్క్‌షా ప్ గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వద్ద 2205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 18 బేస్‌తో ఉంది. సంవత్సరానికి ఆరు వేలకుపైగా కార్లకు ఇక్కడ సేవలు అందించనున్నారు. నూతన కేంద్రం ప్రారంభంపై స్కోడా ఆటో ఇండియా బ్రాం డ్ డైరెక్టర్ జక్ హోల్లిస్ మాట్లాడుతూ.. యాజమాన్య అనుభవాలను విస్తరించడమనేది తమ వృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమని, తమ నెట్‌వర్క్ ఉనికి విస్తరణ ఈ లక్ష్యం చేరుకోవడంలో కీలకాంశంగానూ ఉంటుంద ని అన్నారు. హైదరాబాద్‌లో ఈ నూతన డీలర్‌షిప్ కేంద్ర ప్రారంభం ఈ ప్రణాళికలో భాగమన్నారు. పీపీఎస్ మోటా ర్స్‌తో భాగస్వాం చేసుకోవడ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital