Friday, November 22, 2024

Yadadri: అర్హులందరికీ ఆరు గ్యారంటీల పథకాలు…ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి ప్రతినిధి, ప్రభన్యూస్ః ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాతాళ్లగూడెంలో ప్రజాపాలన కార్యక్రమం ప్ర్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం క్రింద ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించడం ఎవరూ అనుకోలేదని, ఇది ధైర్యం కలిగిన ప్రభుత్వమని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీలపైనే మొదటి సంతకం చేశారని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి నాగిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, ఎంపిపి రమేశ్ రాజు, జడ్పిటిసి పద్మా అనంతరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి, మండల అభివృద్ధి అధికారి గీతా రెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లేశం, ఎంపిటిసి నర్సింహ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement