Monday, November 18, 2024

Breaking: దిశ ఎన్‌కౌంటర్ పై సుప్రీం కోర్టుకు నివేదిక

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ పై విచారణను కమిటీ పూర్తి చేసింది. సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. విచారణలో భాగంగా పోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం నివేదికలు, ఫొటోలు, వీడియోలను కమిషన్ సేకరించింది. మొత్తం 57 మంది వీడియో వాంగ్మూలాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

కాగా, దిశా ఎన్‌కౌంటర్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ గతంలో నియమించిన సంగతి తెలిసిందే. మిటీలో రిటైర్డ్ జడ్జి వీఎస్ సిర్పుర్కర్, రేఖ (బాంబే హైకోర్టు మాజీ సీజే), సీబీఐ మాజీ అధికారి కార్తికేయ ఉన్నారు. 2019లో దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు – మహ్మద్ ఆరీఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ మరియు జొల్లు నవీన్ షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేస్తున్న సమయంలో నిందితులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేశారు. దీంతో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఘటనపై కమిటీ విచారణ జరిపింది. 2019లో ఈ కమిషన్ విచారణ చేసింది. అయితే, కరోనా కారణంగా విచారణ ఆలస్యం అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement