Tuesday, November 26, 2024

సిరివెన్నెల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు : త‌లసాని

సిరివెన్నెల మరణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్దీవ దేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ….సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు ప్ర‌జ‌ల‌కు బాధ‌క‌ర‌మైన రోజన్నారు. 3 వేల పాటలు రాసిన మహనీయుడు.. తెలుగుదనం ఉట్టిపడేలా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు పండగలా ఉంటాయ‌న్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు, 11 సార్లు నంది అవార్డు రావడం గొప్ప విషయమ‌న్నారు. సిరివెన్నెల పాటలు అందరికీ అర్ధమ‌య్యే విధంగా ఉంటాయన్నారు. అతి తక్కువ వయసులో దూరం కావడం బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన‌న్నారు. పాటల రచయితలు సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement