సిరిసిల్ల నవంబర్ 17 (ప్రభ న్యూస్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వేములవాడ ఆలయ విస్తరణ ఏర్పాట్లతో నేతన్నల కోసం నూలు బ్యాంకు ఏర్పాటుతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల కోసం రేవంత్ రెడ్డి 50 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నెల 20న జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
గతంలో 100 కోట్లు ఇస్తామని ప్రచారం చేసిన కేసీఆర్ బ్రోచర్లతో కాలం వెళ్లదీశారని విమర్శించారు. 30 ఏళ్ల చరిత్రలో నూలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు. విమర్శలు చేస్తున్న యువరాజు కేటీఆర్ ఎందుకు తెలేయలేకపోయాడని ప్రశ్నించారు.
జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభంతోపాటు కొన్ని ప్రతిపాదనలు మంజూరు చేయనట్లు తెలిపారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏ ఒక్కరికి ఐదు లక్షల పరిహారం ఇవ్వలేకపోయారని అన్నారు.
పీసీసీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం 4696 మందికి ఇండ్ల నిర్మాణం కోసం 230 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మల్కాపేట్ రిజర్వాయర్ కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.