సిరిసిల్లలో.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ఇది స్వల్ప కాలం మాత్రమే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంరతం మాట్లాడుతూ..ఎన్నికలల్లో అనుకోని ఫలితాలు రావడం సహజమని.. నిరాశ పడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్, పోరాటాల నుంచి వచ్చిన పార్టీ.. పోరాటాలు తమకేం కొత్తకాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడుతామన్నారు.
కెసిఆర్ ఓటమిని ప్రజలు నమ్మడం లేదు..
అయ్యో.. కేసీఆర్ ప్రభుత్వం పోయిందా?.. అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతూ బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రానిస్తామని అన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని.. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వదులుకోరని చెప్పారు.