Tuesday, November 19, 2024

Siricilla – అవినీతి కథలు ఆపి.. ఇచ్చిన హామీలు అమలు చేయండి – రేవంత్ కు కేటీఆర్ క్లాస్

సిరిసిల్ల – కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పై మండిపడ్డారు .అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదని..అందుకే నొటికొచ్చినట్టు హామీలు ఇచ్చారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కాదు ఫోర్ ట్వంటీ హామీలన్నారు. రైతు బంధు కొసం రైతులు ఫొన్లు చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పొలాల్లో నాట్లు పడ్డా..రైతులకు రైతుబంధు దిక్కులేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి కాదు. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వ‌చ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం ప‌ద‌వులు మీకు ద‌క్కేవా..? రేవంత్ రెడ్డి ప‌లికేవ‌న్నీ ప్ర‌గ‌ల్భాలే. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌ప్పించుకునేందుకు రోజుకో అవినీతి క‌థ అల్లుతున్నారు. ఇక్క‌డ అవినీతి.. అక్క‌డ అవినీతి అని క‌థ‌లు చెబుతున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. అవినీతిని వెలికితీయ‌మ‌నే చెబుతున్నాం. అవినీతి జ‌రిగిన‌ట్లు తేలితే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకుంటే వ‌దిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చ‌రించారు

ఏదైనా పథకం తెస్తే ఆలోచించి తేవాలని కాంగ్రెస్ కు సూచించారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారన్నారు. ఉచితం కావడంతో బస్సుల్లో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. మార్పు కావాలని ఓటు వేసిన వారు లబోదిబోమంటున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది మళ్లీ కరెంట్ కష్టాలు స్టార్ట్ అయ్యిందన్నారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాల పురాణం చెప్పారు. కేసీఆర్ పంపిన ముగ్గురు సైనికులే అసెంబ్లీలో అదరగొట్టారని గుర్తు చేశారు. అలాంటిది కేసీఆరే అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించకొండని చెప్పారు. ఉద్యమ సమయం నుంచి కారు జోరుగా పరిగెత్తిందని అన్నారు. 25 ఏళ్లు తిరిగిన కారు సర్వీసింగ్ కు రాదా అని ప్రశ్నించారు.

కార్యకర్తలు నిరాశ పడొద్దని..ఇది కేవలం బ్రేక్ మాత్రమే అని కార్యకర్తలకు అన్నారు. కేసీఆర్ లేకపొతే తెలంగాణ ఎక్కడిది పదవులు ఎక్కడివన్నారు. మోసం చేస్తే రైతులు కాంగ్రెస్ ను ఊచకొత కోస్తారని చెప్పుకొచ్చారు. సిరిసిల్లలో గెలిపించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యావాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement