Friday, November 22, 2024

Siricilla – బి అర్ ఎ ఎస్ కు అవిశ్వాసం సెగ…కేటీఆర్ సభ కు 14 మంది కౌన్సిలర్ లు డుమ్మా

సిరిసిల్ల, (ప్రభన్యూస్): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో అవిశ్వాసాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో సిరిసిల్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ సెగ తగిలింది. కొద్ది రోజులుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందo కళ చక్రపాణి పై అవిశ్వాసం ప్రక్రియ కొనసాగుతున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆదివారం ఒక అడుగు ముందుకు పడింది.

తాజాగా ఆదివారం 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు తరలి వెళ్లడంతో ఈ ఉదoతం గుప్ప మంటున్నది. మరో వైపు సిరిసిల్లలో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం జరుగుతున్న ఆదివారం రోజే కౌన్సిలర్లు అసమ్మతి క్యాంపునకు తరలి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీనీ షాక్ కు గురిచేసింది.

. కేటీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీ రామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఉదoతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ప్రస్తుత పాలకవర్గంపై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అవిశ్వాసం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం క్యాంపునకు వెళ్లడానికి కౌన్సిలర్లు సిద్ధం కాగా వీరందరికీ నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందరావు వీరందరిని నచ్చజెప్పి ఈ ప్రయత్నాన్ని విరమింప చేసినట్టు తెలిసింది

. తాజాగా ఆదివారం సిరిసిల్లలో నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో 12 మంది కౌన్సిలర్లు అసమ్మతి శిబిరానికి తరలి వెళ్లారని, తరువాత ఈ సంఖ్య 16 కు చేరుకున్నదని చెబుతున్నారు. అస‌మ్మ‌తి శిబిరానికి త‌ర‌లింపు..ఆదివారం సాయంత్రం వరకు సిరిసిల్లలో బీఆర్ఎస్ సమావేశం జరుగుతుండగా సమావేశానికి హాజరైన కౌన్సిలర్ల నుండి కూడా అసమ్మతి శిబిరానికి తరలి వెళ్ళనున్నారని సమాచారం వెల్లడి అవుతున్నది.

ప్రస్తుతం బీఆర్ఎస్ సమావేశానికి 20 మంది వరకు కౌన్సిలర్లు హాజరు అయ్యారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బిజెపి కౌన్సిలర్లు పోగా 34 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల బలం ఉన్నది. ఆదివారం సాయంత్రానికి ఎందరు కౌన్సిలర్లు అసమ్మతి శిబిరానికి చేరుకుంటారో, ఎప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు అనే అంశాలపై క్లారిటీ రానుంది. శిబిరానికి వెళ్లిన సభ్యులలో విలీన గ్రామాల కౌన్సిలర్లు ఉన్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement