Saturday, November 23, 2024

తహసీల్దార్‌ ఆఫీస్‌కు తాళి కట్టిన ఘటనపై విచారణ..

సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహసీల్దార్‌ ఆఫీస్‌కు తాళి కట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఘటనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ అధికారిగా సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్‌ను నియమించారు. వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వాస్తవ వివరాలతో సమగ్ర రిపోర్ట్ గురువారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీవోను అదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారులతో మాట్లాడారు. 2018లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దానిపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.

త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలువురు మంత్రి కేటీఆర్ కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘటపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని..త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి:సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే ఆపివేయాలి: గురజాల ఆర్డీవో

Advertisement

తాజా వార్తలు

Advertisement