Saturday, November 23, 2024

తెలంగాణలో మూడోసారి కెసిఆర్ ప్రభుత్వమే – మంత్రి సింగిరెడ్డి

వనపర్తి/పెద్దమందడి: ఏప్రిల్ 25 (ప్రభ న్యూస్);తెలంగాణలో మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి లక్ష్మీప్రసన్న 0 లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశంలో పార్టీ జెండాను ఎగురవేసి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.2024 పార్లమెంటు ఎన్నికలు ఈ దేశ భవిష్యత్ కు పరీక్ష అని అన్నారు. దేశం తిరోగమనం వైపు వెళ్లాలా ? అధునిక ప్రపంచంతో పోటీ పడి పురోగమనం వైపు వెళ్లాలా అన్నది మన ముందున్న ప్రశ్న అని అన్నారు.బీజేపీ ప్రభుత్వాల్లో అభివృద్ధి శూన్యమని చెప్పారు.9 ఏళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముందు పెట్టారన్నారు. తెలంగాణలో మూడోసారి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆత్మలేని పార్టీలు ఇక్కడ ప్రతిపక్షాలుగా ఉన్నాయనీ విమర్శించారు. మహారాష్ట్ర లో కేసీఆర్ ఔరంగాబాద్ పర్యటన భారీగా విజయవంతమయ్యిందనీ తెలిపారు.అక్కడ స్థానిక ఎన్నికలలో విజయం బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ఆ రిజర్వేషన్ తీసేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు.మహారాష్ట్రలో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఐదేళ్లలో ఇంటింటికి తాగునీరిస్తాం అని చెప్పారు. కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడితే .. బీజేపీ నేతలు జైళ్లు, కేసులు, నిర్బంధాల గురించి మాట్లాడతారనీ ఎద్దేవ చేశారు. రాజకీయాల్లో అవకాశం ఇస్తే ఏంచేస్తారో మాట్లాడకుండా ఆరోపణలు, అబద్దాలతో నిందలు వేస్తున్నారనీ అన్నారు.ఇచ్చిన అవకాశంతో చేసిన అభివృద్దిని ముందుపెట్టి ప్రజల ఆశీస్సులు కోరదామని పిలుపునిచ్చారు

.గతంలో దశాబ్దాల పాటు పాలించిన వారు ప్రజల జీవితాలలో మార్పు కోసం చేసిన కృషి ఎంత ? ఈ 9 ఏళ్లలో వచ్చిన మార్పు ఎంత ? ప్రజలలో చర్చ పెట్టి ఒప్పించాలన్నారు. ప్రజల ఆలోచనలను మనం అందుకోవాలి ..వారి వేగాన్ని మనం అందుకోవాలనీ సూచించారు.కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో బైపాస్ రహదారికి శంకుస్థాపన, సమీకృత మార్కెట్, టౌన్ హాల్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభింపజేస్తామనీ, అనంతరం భారీ బహిరంగసభ నిర్వహిస్తామని అన్నారు.ప్రజాక్షేత్రంలో ప్రజల కదలికలే నాయకుల ప్రతిభకు గీటు రాయనీ అన్నారు. మూడేళ్లలో కట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల దేశ, విదేశీ ఇంజనీరింగ్ నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నదనీ అన్నారు.విమర్శలకు ప్రజల తీర్పుతోనే సమాధానం చెప్పాలన్నారు.ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారు .. వారి మద్దతు మనకు ఉంటుందనీ అన్నారు.

. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతమ్మ , జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా పార్టీ శిక్షణా కమిటీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎత్తం రవి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, వార్డు మెంబర్లు, పార్టీ బాధ్యులు తదితరులు పాల్గోన్నారు……

Advertisement

తాజా వార్తలు

Advertisement