ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో అమ్మకాలు, లాభాల్లో సింగరేణి గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంపై సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేస్తూ సింగరేణి అధికారులు, ఉద్యోగులకు తన అభినందనలు తెలిపారు. మిగిలిన 3 నెలల కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్తు ఉత్పాదన కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉందనీ, తద్వారా గణనీయమైన వృద్ధితో సింగరేణి చరిత్రలోనే ఈ ఆర్దిక సంవత్సరంలో అత్యధికంగా 27 వేల కోట్ల రూపాయల మేర టర్నోవర్, రికార్డు స్థాయి లాభాలు గడించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఏరియాల్లో పూర్తి స్థాయి యంత్ర వినియోగంతో రోజువారీగా, గనుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు, కార్మికులు అంకిత భావంతో పని చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital