సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సంస్థ..69.80 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసింది.
- Advertisement -
2022-23లో 67.14 మిలియన్ టన్నులు, 2021-22లో 65.02 మిలియన్ టన్ను లు, 2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అలాగే రవాణలోనూ 2019-20లో 62.45 మిలియన్ టన్నులు కాగా, 2020-21లో 48.51 మిలియన్ టన్నులు, 2021-22లో 65.53 మిలియన్ టన్నులు, 2022-23లో 66.69 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది.