Wednesday, November 13, 2024

Job Exams – ప్రశాంతంగా ముగిసిన సింగ‌రేణి ఉద్యోగ‌ పరీక్షలు …

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – సింగరేణి లో 327 ఎక్స్ టర్నల్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6, 7 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. మేనేజ్ మెంట్ ట్రెయినీ( ఈ అండ్ ఎం) -42 పోస్టులకు, మేనేజ్ మెంట్ ట్రెయినీ (సిస్టమ్స్)-07 పోస్టులకు, జేఎంఈటీ-100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ(మెకానికల్)-09, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ(ఎలక్ట్రికల్)-24, ఫిట్టర్ ట్రెయినీ-47, ఎలక్ట్రిషియన్ ట్రెయినీ-98 పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయన్నారు.

రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 29,291 మంది హాజరైనట్లు తెలిపారు. 84 శాతం హాజరు నమోదైందన్నారు. వారం రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేస్తామని.. దానిపై అభ్యంతరాలను స్వీకరించడానికి గడువును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

గత నెల 20, 21వ తేదీల్లో 272 పోస్టులకు, తాజాగా 327 పోస్టులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించడంతో ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో నిర్దేశించుకున్న 599 ఎక్స్ టర్నల్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయన్నారు.
ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల సందర్భంగా పూర్తి పారదర్శకంగా బయోమెట్రిక్, ఐరిష్ పరికరాల ద్వారా అభ్యర్ధుల వివరాల నమోదు, తనిఖీ చేపట్టారు. సి సి కెమెరాల నిఘా మధ్యన విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు బలరామ్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు.

పరీక్షల నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉండదని, ఎటువంటి రికమండేషన్ లకు తావు ఉండదని కనుక సింగరేణి లో ఉద్యోగాలు ఇప్పిస్తామని. ఎవరైనా మోసగాళ్లు మాయ మాటలు చెప్తే నమ్మి మోసపోవొద్దని, అటువంటి వారి వివరాలను సింగరేణి విజిలెన్స్ విభాగానికి, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని కోరారు.

పోస్టుల వారీగా అభ్యర్థుల హాజరు ఇలా..
అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ(ఎలక్ట్రికల్) పోస్టు కు 3491 , జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులకు 5001 మంది, ఎలక్ట్రిషియన్ ట్రెయినీ పోస్టుకు 5539 మంది, ఫిట్టర్ పోస్టుకు 3666 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ (ఈ అండ్ ఎం) పోస్టుకు 7965 మంది, మేనేజ్మెంట్ ట్రెయినీ (సిస్టమ్స్) పోస్టుకు 1708 మంది, అసిస్టెంట్ ఫోర్మెన్ (మెకానికల్) పోస్టుకు 1921 మంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement