Saturday, November 23, 2024

Singareni Elections – ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికులు

తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాలో సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగ‌నుంది. సింగ‌రేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39, 773 మంది కార్మికులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కుంటారు.
రామగుండం ఏరియాలోని ఆర్జీ-1లో 5404, ఆర్జీ-2లో 3557, ఆర్జీ-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.


6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పోరేట్‌ లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం-1 లో 5,404 మంది, రామగుండం-2 లో 3,557 మంది, రామగుండం-3 లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది ఓటు వినియోగించు కుంటున్నారు.


బెల్లంపల్లి లో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, శ్రీరాంపూర్‌ లో 9,149 మంది మొత్తంగా 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement