మణుగూరు, ,(ఆంధ్రప్రభ న్యూస్): మణుగూరు ఓసి 2 ఘోరా ప్రమాదంలో డంపర్ పల్టీకోట్టి ఆపరేటర్ దుర్మరణం చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.బోగ్గును తీసుకుని వెళ్ళి,డంపింగ్ వద్ద అన్ లోడింగ్ చేస్తుండగా,డంపర్ ఒక్క సారిగా పల్టీ కోట్టడంతో అపరేటర్ మూన్ చంద్ (60) డంపర్ అద్దాలు పగలడంతో రాయి మీద పడిపోయాడు.తలకు బలమైన గాయాలు అవడంతో ,సింగరేణి అధికారులు గమనించి ,వెంటనే చికిత్స కోసం సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
వైద్య చికిత్సాలు నిర్వహించిన వైద్యులు, మెరిగైన వైద్యం కోసం కొత్తగూడెం సింగరేణి అస్పత్రికి చికిత్సకు తరలించారు. ఈ నేపధ్యంలో వైద్యం అందిస్తుండగానే డంప్ ఆపరేటర్ మూన్ చంద్ మృతి చెందాడు.ఇటీవల బదిలీ పై కొత్తగూడెం నుండి మణుగూరు కు వచ్చాడు .మృతుడు మూన్ చంద్ ఇంకా ఏడు నెలల్లో పదవీ విరమణ చేయవలసి ఉండగా, ఈ ప్రమాదంల్లో మృతి చెందడం విషాదం .