భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింధు…. తన పెళ్లికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందించారు.