Friday, October 18, 2024

TG| ఢిల్లీ టూర్ల‌కు సిల్వ‌ర్ జూబ్లీ ! రేవంత్‌ ఢిల్లీ టూర్లపై కేటీఆర్‌ ఫైర్‌

  • పైసా పనిలేదు, రూపాయి లాభం లేదు
  • ప‌ది నెల‌ల్లో 25సార్లు అటూ ఇటూ చక్కర్లు
  • ఢిల్లీ పెద్ద‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లకు సిల్వ‌ర్ జూబ్లీ
  • త‌ట్ట మ‌ట్టి తీసింది లేదు.. కొత్త‌గా చేసింది లేదు
  • రైతుల అరిగోస‌, గాల్లో దీపాల్లా గురుకులాలు
  • రాష్ట్రంలో వైద్యం మొత్తానికే కుంటుప‌డింది
  • ఆడ‌బిడ్డ‌ల‌కు తులం బంగారం ఏమైంది
  • స్కూటీలు, కుట్టుమిష‌న్లు ఎక్క‌డ‌పోయిన‌యి
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్ల‌తో దాడి చేసిన కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేర‌కు గురువారం ట్విట్ట‌ర్ పోస్టులు సెటైర్లు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి అంటూ విరుచుకుపడ్డారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివి అని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ సెటైర్లు వేశారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.

తులం బంగారం, స్కూటీలు, కుట్టుమిష‌న్లు ఏవీ..

మూసీ, హైడ్రా పేరుతో పేద‌ల‌ పొట్ట కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement