మెదక్ జిల్లా మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మార్గంలో కీలక ఘట్టం మంగళవారం ఆవిష్కృతం కానుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్‌పుల్ రైలు (డీజిల్ ఎలక్ట్రికల్ మల్టీపుల్ యూనిట్) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల తరువాత ప్రధాని మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. ఈ మార్గంలో రెండు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది.
కాగా, త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.