Friday, November 22, 2024

అన్నింటిలో సిద్దిపేట మున్సిపాలిటి ఆదర్శం.. కడవేరుగు రాజనర్సు

సిద్ధిపేట ప్రతినిధి : జులై 31: అన్నింటిలో సిద్దిపేట మున్సిపాలిటీ ఆద‌ర్శ‌మ‌ని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు అన్నారు. సిద్దిపేట పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం పట్ల పత్యేక దృష్టి సారించి మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఇటీవలి కాలంలో చేపట్టినటువంటి నడుస్తూ చెత్తను తొలగిద్దాం అను కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ 2వ వార్డు హనుమాన్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుల‌తో కలిసి వార్డులో నడుస్తూ ఓపెన్ ప్లాట్, రోడ్ల ప్రక్కన నాళాలలో ఉన్నటువంటి చెత్తను తొలగిస్తూ సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు ప్రజలకు అవగాహన కల్పించారు.

సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు ఏ కార్యక్రమాన్ని చేపట్టిన కూడా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు వాటిని ఆదర్శoగా తీసుకొని అమలు చేస్తాయని ఆయ‌న‌ అన్నారు. వార్డులో కలియ తిరుగుతూ బుడగ జంగాలు నివాసం ఉన్నటుంటువంటి పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. ఆరుబయట చెత్త చెదారం, నివాస పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో వారిని పిలిచి మందలించారు. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన మీరే కాకుండా మీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అనారోగ్యాల బారిన పడకుండ ఉంటారన్నారు. చెత్తను కచ్చితంగా తడి, పొడి, హానికరమైన చెత్తగా (మూడు రకాలుగా )వేరు చేసి కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు.

- Advertisement -

విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యాన్ని మందలించిన రాజనర్సు ….
వార్డులో ఉన్నటువంటి విజ్ఞాన్ స్కూల్ వారు అన్నం (భోజనం)ను ఆరుబయట పడేయటాన్ని గమనించిన రాజనర్సు వెంటనే వారిని పిలిచి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే పిల్లలకు ఏవిధంగా పరిశుభ్రత పట్ల ఓనమాలు నేర్పిస్తారని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి గుణ-గణాల అలవాట్లు నేర్పిస్తే వారు అభివృద్ధిలోకి వస్తారన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే శిక్షలు కఠినoగా ఉంటాయని హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరిశ్ రావు కృషి, సహకారంతో చేప‌డుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకొని వాటన్నిoటిలో అమలు చేస్తున్నాయని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో ఆరుబయట చెత్తను తొలగిద్దాం అను కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్దిపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని తమ తమ నియోజకవర్గలలో ప్రారoబిస్తున్నారని నిన్నటి రోజున మంత్రి హరీశ్ రావు తెలియజెసినట్లు రాజనర్సు ప్రజలకు సూచించారు.

సిద్దిపేట పట్టణ కౌన్సిలర్లు, అధికారులు ఆరుబయట చెత్త వేయకూడదని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తo చేస్తున్నారని, కొన్ని ప్రాంత ప్రజలలో మరింత మార్పు అవసరమ‌న్నారు. వార్డులో కొంత భాగం సీసీ రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని ప్రజలు రాజనర్సు కు తెలపగా మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే అన్ని సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వారికి తెలియజేశారు. కొన్ని ప్రాంతాలలో యూజీడీ పనులు అసంపూర్తిగా ఉండటాన్ని గమనించిన రాజనర్సు వెంటనే పబ్లిక్ హెల్త్ ఏఈ ని పిలిచి మూడు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేయవ‌ల‌సిందిగా ఆదేశించారు. ఓపెన్ ప్లాట్ల్ లలో ఏపుగా పెరిగినటువంటి చెట్లను ప్లాట్ యజమానులను పిలిచి చదును చేపించుకోవలసిందిగా సూచించాలని వార్డు కౌన్సిలర్ కి సూచించారు. రోడ్లకు ఇరువైపులా పెరిగినటువంటి పిచ్చి గడ్డిని తొలగిస్తూ వార్డు మొత్తం కలియతిరిగుతూ అటువంటి గడ్డిని పూర్తిగా తొలగించాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్ కి సూచించారు.

వార్డులో ఆరుబయట కుండీలలో, తొట్లలో నిల్వ ఉన్నటువంటి నీటిని తొలగించారు. కిరాణా షాపులను తనిఖీ చేస్తూ.. ప్రతి షాపు ముందు కచ్చితంగా చెత్త డబ్బాలను ఏర్పాటు చూసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకూడదని సూచించారు. వార్డులో స్వంత స్థలం కలిగిఉండి పూరి గుడిసెలలో నివసించేటువంటి ప్రజలతో మాట్లాడుతూ.. గృహ లక్ష్మీ పథకంకు దరఖాస్తులు చేసుకోవాలని, అర్హులైన వారందరికీ మంత్రి హరీశ్ రావు సహకారంతో మూడు లక్షలు అందజేస్తామని వారికి సూచించారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement