Sunday, January 12, 2025

Siddipet l సంప్ర‌దాయాలను కాపాడుకోవ‌డం ముఖ్యం : హ‌రీశ్‌రావు

సిద్ధిపేట, ఆంధ్ర‌ప్ర‌భ : మన పుట్టిన ఊరును, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించికుని నిర్వహించిన ముగ్గుల పోటీ విజేత‌ల‌కు ఆయ‌న బ‌హుమ‌తి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయ‌ని, నిర్వ‌హ‌కుల‌ను అభినందించారు.నేటి తరానికి మన పండుగలు, వాటి గొప్పతనాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల‌కు మోసం చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్‌ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌హిళ‌ల‌కు మోసం చేశార‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

- Advertisement -

మహిళలకు మహాలక్ష్మి ప‌థ‌కం కింద రూ.2500 ఇస్తానని మాట త‌ప్పిన‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల్లో మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ మోసం చేసింద‌న్నారు. బతుకమ్మ చీరలు, తులం బంగారం ఎగ్గొట్టిండని.. పాత పథకాలు బంద్ అయిపోయాయ‌న్నారు. అలాగే కొత్త ప‌థ‌కాలు ఏవీ రాలేద‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement