సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్ ను ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి రైతు బజార్‌లో నెలకొల్పిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇంకెమైనా కావాలా? అంటూ రైతులను అడిగారు. గిట్టుబాటు గిరాకీ అయితుందా. సౌలత్‌లు ఎట్లున్నాయని ఆరాతీశారు.
ములక్కాయలు విక్రయిస్తున్న మహిళా రైతుతో మాట్లాడుతూ గిట్టుబాటు అవుతుందా..లేదా అంటూ వివరాలు అడిగారు. కిలో రూ.50 ధర పలుకుతున్నదని రైతు వివరించింది. ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని ఆమె ఆమె అంది. . తాను కూడా ఐదేకరాలు ములక్కాయ పంట పెడతానని మంత్రి హుషారుగా అన్నారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు హైదరాబాదు మార్కెట్లో సైతం ఎగుమతి చేయాలని దీని కోసం సంబంధిత అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితకు సూచించారు.
నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతు బజారును పరిశుభ్రంగా నిలపాలని ఎస్టేట్ అధికారి ప్రభాకర్‌ను ఆదేశించారు. పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతు ఆగ్రహం వ్యక్తం చేశారు