సిద్దిపేట – పొలిటికల్ లీడర్స్ తమ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న వెపన్స్‌ని ఆయా స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16లోపు పీఎస్‌లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలుంటాయని తెలిపారు. ఇక.. డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్‌ని తిరిగి తీసుకోవచ్చని సూచించారు.
పారదర్శకంగా విష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ గురించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. . ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రజలు ప్రజా ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో బార్డర్ పోలీస్ స్టేషన్లలో 10 చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, 24X7 వాహనాలు తనిఖీ నిర్వహిస్తామని పేర్కొన్నారు..
జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వివరాలు
- జక్కాపూర్ చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధి.
- దేవక్కపల్లి బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధి.
- వంటిమామిడి ములుగు పోలీస్ స్టేషన్ పరిధి.
- భూంపల్లి ఎక్స్ రోడ్ భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి.
- బేగంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా
- జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా
- లద్దునూర్ గ్రామ శివారు మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధి.
- ముస్త్యాల విలేజ్ చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధి
- జిల్లెల్ల గడ్డ చౌరస్తా
- అక్కన్నపేట గ్రామ శివారు.