నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శివారులో కొనసాగుతున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు.
జరగాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటినందించాలని అధికారులకు పోచారం సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, అటవీ శాఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.