Tuesday, November 26, 2024

ముగిసిన సిక్ హాలిడేస్.. బాసర ట్రిపుల్ ఐటీలో కనిపించని విద్యార్థులు

నిర్మల్ ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో PUC 1 విద్యార్థి జాదవ్ బబ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఈనెల 11నుండి 15 హోమ్ సిక్ హాలిడేస్ ప్రకటించిన వీసీ వెంకట రమణ
నిన్నటితో హాలిడేస్ ముగిసినా విద్యార్థులు ఇంకా క్యాంపస్ కు చేరుకోలేదు. 1492 మంది విద్యార్థులకు గాను 56 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. వీసీ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకు వీసీతో విద్యార్థులు అనే మీటింగ్ కండక్ట్ చేసి విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల జాగ్రత్తలు వహించాలని వీసీ సూచించారు. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి హోమ్ సిక్ హాలిడేస్ కు ముందు విద్యార్థులతో మాట్లాడారు.

ట్రిబుల్ ఐటీ మీద భరోసా కలిగితేనే పంపించాలని చెప్పిన వీసీ క్యాంపస్ లో మంచిగా చదువుకునేలా మానసికంగా తల్లిదండ్రులు సిద్ధం చేసి పంపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భరోసా కల్పించిన వీసీ హాలిడేస్ తరువాత పంపాలని ఆదేశించారు. హాలిడేస్ ముగిసినా విద్యార్థులు బాసర ట్రిబుల్ ఐటికి రాకపోవడంతో స్టూడెంట్స్ పై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది ట్రిపుల్ ఐటి. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. ఒక్కో లెక్చరర్ వంద మందికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలింగ్ కోసం కౌన్సిలర్ల సంఖ్య పెంచాలని గర్ల్స్ కోసం మహిళ టేకర్స్ ను ఏర్పాటు చేశారు. రోజూ యోగా.. 15 రోజులకు ఒకసారి మోటివేషన్ క్లాస్.. వారానికి ఒకసారి ఆర్ యూ ఒకే ప్రోగ్రాం. ప్రతీ శనివారం మోటివేశనల్ మూవి స్పోర్ట్స్ యాక్టివిటి పెంచుతున్నామని తెలిపారు. స్టూడెంట్, పేరెంట్స్ తో వారానికి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందులపై కమిటీ మెస్ క్వాలిటీని చెక్ చేసేందుకు లెక్చరర్లు పర్యవేక్షించాలని సూచించారు. అయినప్పటికీ విద్యార్థులు క్యాంపస్ కు రాకపోవడంతో చర్చకు దారి తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement