Monday, November 25, 2024

HYD: ఇంటర్నేషనల్ టైటిల్స్ ను సొంతం చేసుకున్న శ్రియ గడ్డం

కాచిగూడ, డిసెంబర్ 23 (ప్రభ న్యూస్): శ్రియ గడ్డం అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ రెండు టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ఎంపవర్ మెంట్ గ్లోబల్ ఉమెన్ ఫెస్టివల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా
మిస్ టీన్, మిస్ మిసెస్ ఇండియా డబ్ల్యుఎ యుఎస్ఎ, మిస్టర్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియా, మిసెస్ యూనివర్స్ అమెరికా ప్రదర్శించిన పోటీల్లో పాల్గొని ‘మిస్ టీన్ ఇండియా 2023, మిస్ టీన్ ఫిలాంత్రోపీ యూనివర్స్ 2023’ టైటిల్ ను గెలుచుకుంది.


శ్వేత, విజయ్ గడ్డం కుమార్తె శ్రియ గడ్డం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్ కిర్క్‌ల్యాండ్ లో 8వ తరగతి చదువుతూ.. నృత్యం, నటన, మోడలింగ్, సంగీతం పట్ల శ్రియకు మక్కువతో 5సంవత్సరాల వయస్సులోనే కళారంగాల్లో రాణించడం సంతోషదాయకమన్నారు. పోటీల్లో పాల్గొని మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ 2023, మిస్ టీన్ ఇండియా ఫిలాంత్రోపీ యూనివర్స్ 2023 అనే రెండు టైటిళ్లను గెలుచుకున్నారు. తెలుగు అమ్మాయి రెండు టైటిళ్లను గెలుచుకోవడం అభినందనీయమన్నారు. ఎంపవర్ మెంట్ గ్లోబల్ ఉమెన్ ఫెస్టివల్ సంస్థ మహిళల సాధికారత కల్పించాలనే లక్ష్యంతో యూఎస్ఏ ఆధారితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మెంకా సోనీచే స్థాపించబడిన సంస్థ ప్రపంచ వ్యాప్తంగా లాభాపేక్ష రహితంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రదర్శనకు వివిధ ప్రముఖులు, న్యాయమూర్తులు హాజరయ్యారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement