Tuesday, November 19, 2024

Big Breaking | సూర్యాపేటపై వరాల జల్లు.. చమత్కారాలు, చలోక్తులతో నవ్వులు పూయించిన కేసీఆర్!

జగదీశ్వర్​రెడ్డి గింత హుషారని నేను అనుకోలేదు. మా సూర్యాపేట జిల్లాకు అన్నిచ్చిర్రు.. ఒక్కసారి వచ్చిపోతే చాలాని అక్కడ చెప్పిండు. రైతు రుణమాఫీ చేయాలని వాదించిన వారిలో అగ్రగన్యుడు జగదీశ్వర్​రెడ్డి. చలి అన్నం తింటా.. ఉడుకు బువ్వ అయ్యేదాకా ఉంటా అన్నట్టు నన్ను ఈడిదాకా తీసుకొచ్చి పెద్ద పెద్ద కోర్కెలే ముందటపెట్టిండు. అని సీఎం కేసీఆర్​ అన్నారు. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం సూర్యాపేటలో జరిగిన సభలో ప్రసగిస్తూ.. చమత్కారాలు, చలోక్తులతో అందరినీ నవ్వించారు.

ప్రజల మధ్య ఉండి పనిచేసే నాయకులు ఇక్కడున్నరు.  ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. సూర్యాపేటలో కళాభారతి కావాలని కోరారు.. ఇక్కడి సాంస్కృతికత అంత గొప్పది. కళాభారతి కోసం 25 కోట్లు మంజూరు చేస్తాం అని ప్రకటించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు కూడా తగినన్ని నిధులు ఇస్తామని ప్రకటించారు. ఆర్​ అండ్​ బీ గెస్ట్​ హౌస్​ కూడా మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.ఇక నీ దుకాణం అయిపోయింది.. ఇగ నా దుకాణం చెప్పాలే అంటూ జగదీశ్వర్​రెడ్డిని ఉద్దేశించి చమత్కరించారు.

కల్లాల కాడికి వచ్చేటోళ్ల లెక్క వస్తుంటరు జాగ్రత్త!

వరికోతలు కాగానే కల్లాల కాడికి అడుక్కున్నోళ్లు వచ్చినట్టు కొత్త కొత్త వాళ్లు వస్తుంటరు.. నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కడ్నే మరిచిపోవద్దు.. ఊళ్లెకు పోయిన తర్వాత కేసీఆర్​ గిది చెప్పిండు.. మంచా చెడా అని చర్చకు పెట్టాలే. బీజేపీ వాళ్లు, కాంగ్రెస్​ వాళ్లు వస్తున్నరు. ఒక్క చాన్స్ఇయ్యాలే​ అంటున్నరు. వీళ్లేమన్న కొత్తవాళ్లా.. 50 ఏండ్లు పరిపాలించిండ్లు.. భువనగిరిలో, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన చేసిండ్లా? వాళ్లకెందుకు ఓటెయ్యాలే? అంటూ ప్రశ్నించారు.

ఆగమాగం కావద్దు..

- Advertisement -

ఆగమాగం కావద్దు, ఓట్లు రాగానే, ఎలక్షన్లు రాగానే గాయి గాయి కావద్దు. కులం లేదు, మతం లేదు అందరినీ కడుపుల పెట్టుకుని మంచిగ జేస్కుంటున్నాం. ఒక్కొక్కటి దారికి తెచ్చుకుంటున్నాం. మళ్లా గాడి తప్పితే నష్టపోయేది మనమే. 50 ఏండ్ల రాజ్యం ఏలిన కాంగ్రెస్​.. ఇప్పుడు పెన్షన్లు ఇస్తామంటున్నారు. మరి అప్పుడెందుకో ఇయ్యలేదు. వాళ్లు పరిపాలించే రాష్ట్రాలల్లో ఇస్తున్నరా? ఆ పార్టీకి రాష్ట్రానికో నీతి ఉంటదా? మంది మాటలు పట్టుకుని మార్మానం పోతే మల్లొచ్చేసరికి ఇల్లు గుల్లయితది.. అందరూ ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement