Saturday, November 23, 2024

TS | తెలంగాణ బాపు అని చెప్పుకోడానికి సిగ్గుండాలి.. కెసిఆర్ పై రేవంత్ ఫైర్

హైదరాబాద్ : విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ… తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని చెప్పారు.

కేసీఆర్ తాను తెలంగాణ బాపు అని తనకు తానే చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అనే స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. తెలంగాణలో ఆదాయం పడిపోయిందని.. ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement