Monday, November 18, 2024

Shodow Day – మధ్యాహ్నం 12.12 గంటలకు మీ నీడ మాయం

ఎండలో ఎక్కడికి వెళ్లినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలైతే నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది.

ఆ విషయం మీకు తెలుసా? అలాంటి అరుదైన సంఘటనే ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. దీన్నే జీరో షాడో డే లేదా శూన్య నీడ అంటారు.ఈ ‘శూన్య నీడ’ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు.

హైదరాబాద్‌లో ఈ శూన్యనీడ గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని చెప్పారు. ఔత్సాహికులు తమ ఫొటోలను [email protected] కు పంపించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement