Friday, November 22, 2024

మళ్లీ ‘అన్న’ల లేఖతో అలజడి.. మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌పై మావోయిస్టుల సీరియ‌స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో కార్పొరేట్‌ వ్యవసాయాన్ని అమలు చేస్తున్న బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు ) వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరిట కరపత్రాలు వెలువడడం కలకలం రేపుతోంది. హైబ్రిడ్‌ విత్తనాలతో మొక్కజొన్న రైతులను మోసగిస్తున్న సింజంట, సిపీ, పయనీర్‌ , కావేరీ, హైటెక్‌ వంటి కార్పొరేట్‌ సంంస్థలు పెట్టుబడులు పెడుతూ సొంత భూములు కలిగిన రైతులనే వ్యవసాయ కూలీలుగా మార్చి విపరీతమైన లాభాలు గడిస్తున్నారని ఆ పార్టీ కార్యదర్శి సుధాకర్‌ పేరిట కరపత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రైతుల భూముల్లో కార్పొరేట్‌ కంపెనీలు స్వయంగా వచ్చి విత్తనాలు వేయడం మొదలు మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ప్రైవేటు కంపెనీలే రైతుపై పూర్తి అధికారాలు చెలాయిస్తున్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement