Friday, November 22, 2024

వర్సిటీ ప్రొఫెసర్లకు షాక్‌.. వయోపరిమితి పెంపునకు సర్కారు నిరాకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను తిరస్కరిస్తూ జీవో నెంబర్‌ 13ను జారీ చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగుల విరమణ వయో పరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచిన విసయం తెలిసిందే. యూజీసీ నిబంధనల ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లు అమల్లోకి ఉంది. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇక్కడి వర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడేండ్లు పెంచినందున ప్రొఫెసర్లకు సైతం 60 నుంచి 63 పెంచాలని కోరారు. లేదా యూజీసీ ప్రకారం 65 ఏండ్లకు పెంచాలని ఈ మూడు ప్రతిపాదనలను సీఎంకు ఉన్నత విద్యామండలి గతంలో నివేదించింది. ఈమేరకు 60 నుంచి 65కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement