Friday, November 22, 2024

Shock To Congress – బిఆర్ఎస్ లోకి పొన్నాల …. మ‌రికొద్దిసేప‌టిలో కెటిఆర్ భేటి?

హైద‌రాబాద్ – తెలంగాణాలో శరవేగంగా రాజకీయ మారుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.. బిసి వ‌ర్గానికి బ‌ల‌మైన నేత‌గా ఉన్న పొన్నాల ఒక‌నొక ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేస్ లో కూడా ఉన్నారు.. అయితే తాజా ఎన్నిక‌ల‌లో బిసిల‌కు న్యాయం చేయాల‌ని పొన్నాల స్థానిక నేత‌ల నుంచి ఢిల్లీ పెద్ద‌ల‌ను సైతం క‌ల‌సి విన్న‌వించారు..  ఇక జనగామ టికెట్ ను కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. పొన్నాల అసహనం వ్యక్తం చేసి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా.. జనగామ నుంచి నాలుగు సార్లు పొన్నాల గెలుపొంది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు

కాగా, పొన్నాల అధికార బిఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. పార్టీకి రాజీనామా చేయ‌క‌ముంటే పొన్నాల బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు , బిఆర్ ఎస్ నేత దాసోజ్ శ్ర‌వ‌ణ్ తో పాటు ఇత‌ర నాయ‌కుల‌తో గ‌త రాత్రి చ‌ర్చ‌లు జ‌రిపారు.. బిఆర్ ఎస్ నుంచి స్పష్ట‌మైన హామీ ల‌భించ‌డంతోనే నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..మ‌రికొద్దిసేప‌టిలో పొన్నాల నివాసానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ల‌నున్న‌ట్లు బిఆర్ఎస్ నుంచి సంకేతాలు వ‌స్తున్నాయి.. కెటిఆర్ స్వ‌యంగా పొన్నాల‌ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.. కాగా, పొన్నాల జనగాం సీటు ను ఆశిస్తున్నారు.. బిఆర్ఎస్ ఇప్ప‌టికీ ఆ స్థానం నుంచి అభ్య‌ర్ధిని అధికారంగా ప్ర‌క‌టించ‌లేదు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మ‌న్ పోస్ట్ ఇవ్వ‌డంతో ఆయ‌న అక్క‌డ నుంచి పోటీ చేయ‌ర‌ని నిర్ధార‌ణ అయింది.. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి అక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని బిఆర్ ఎస్ ఆలోచ‌న‌.. ప్ర‌స్తుతం మారిన స‌మీక‌ర‌ణ‌ల‌తోనే పొన్నాల‌కు సీటు ఇస్తారా.. లేక ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తారా అనేది తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement