Tuesday, November 26, 2024

Shock To BRS Party ..ఎమ్మెల్సీ కూచుకుళ్ల పార్టీకి రాజీనామా…. హస్తం గూటికి చేరనున్నట్లు ప్రకటన

పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్‌ ఎమెమల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపారు. గత నాలుగున్నరేళ్ల కిందట కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు.

అయితే.. తనకు బీఆర్ఎస్‌లో తగినంత ప్రాధాన్యత ఇచ్చిన్నటికీ స్థానికుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు దామోదర్‌రెడ్డి. అందుకే తాను బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పంపుతున్న రాజీనామాను అంగీకరిస్తారని భావిస్తున్నానని లేఖలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఈనెల 31న పాలమూరు ప్రజాభేరిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న‌ట్టు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement