Saturday, November 23, 2024

TS | బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీ వీడిన మరో నేత

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మంచిర్యాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేతకు సమర్పించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్‌ఎస్‌ని వీడుతున్నట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ ఎస్ ఖాళీ అవుతున్నట్లు అర్థమవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement