Monday, November 25, 2024

TS | గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్..

గజ్వేల్, ( ప్రభ న్యూస్) : గజ్వేల్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అపార్టీకి చెందిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ సయ్యద్ మతీన్ ఇవ్వాల (గురువారం) రాత్రి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు నాయిని యాదగిరి,సాజిద్, డాక్టర్ వాహీద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement