Thursday, November 21, 2024

TS: బీజేపీకి షాక్… క‌మ‌లానికి విక్ర‌మ్ గౌడ్ రాజీనామా…

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ముకేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా బీజేపీ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదంటూ విక్రమ్‌ గౌడ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు ఆయన లేఖ రాశారు.

ఇక, లేఖలో..’పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రజా బలం లేనివారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు’ తెలిపారు. ఇదిలా ఉండగా.. విక్రమ్‌ గౌడ్‌ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement