Wednesday, November 20, 2024

Shobha Yatra – మొదలైన గణేష్ నిమజ్జన శోభ యాత్ర …

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ మొదలైంది. ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తుల సందడి మధ్య ఘనంగా ముందుకు సాగుతుంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరుతాడు.

70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై..ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన తర్వాత పార్వతీ తనయుడిని టస్కర్ పైకి చేర్చారు. స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతా మూరుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఖైరతాబాద్ నుంచి శోభాయాత్రం ప్రారంభం అయ్యింది.

రెండున్నర కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్.. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను చేపట్టారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్ ను ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం 2 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

- Advertisement -

గతంతో పోలిస్తే ఈసారి గణపతి మండపాలు భారీగా పెరిగాయి. దాదాపు లక్ష విక్రమాలు హుస్సేన్ సాగర్ తరలివస్తాయిన గురువారం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 5లక్షల మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు సాగర పరిసరాలకు చేరుకుంటారని పోలీసులు చెబుతున్నారు.

ఇక బాలపూర్ గణనాథుడికి ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement