పెద్దపల్లి: మహిళల రక్షణ కోసమే షీ టీములు పనిచేస్తున్నాయని పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి మండలంలోని చేకురాయిలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని సమస్యలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి మహిళ తమ కుటుంబ సభ్యులు ఎవరూ గంజాయికి బానిస కాకుండా చూసుకోవాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రామ్మూర్తి, సర్పంచ్ బండారి త్రివేణి, ఎంపీటీసీ రాజేశ్వరి, మౌనికతో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement