Friday, November 22, 2024

ష‌ర్మిల పార్టీ ప‌రిస్థితి ఇదే – చేస్తే దీక్ష‌, పాద‌యాత్ర‌… లేకుంటే స్త‌బ్ధ‌త‌…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడితే కొన్ని సీట్లయినా సాధించి కీలక భూమిక పోషించాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్‌ ఆర్టీపీ ఆ దిశలో కార్యాచరణను చేపట్టడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీకి కేడర్‌ ఉన్నప్పటికీ, నాయకత్వం వారిని ప్రజా సమస్యలపై కదిలించడంలో విఫలమవు తోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో వైఎస్‌ ఆర్టీపీని బలోపేతం చేసేందుకు ఎన్నోఅవకాశాలు ఉన్నాయి. కానీ అవకా శాలను అందిపుచ్చుకోవడంలో పార్టీ విఫల మవుతోంది. దీక్షలు, పాదయాత్రలు ఉన్న సందర్భంలో పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాయి తప్ప, మిగతారోజుల్లో పార్టీలో స్తబ్దత నెలకొంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోప ణలు, విమర్శలు వచ్చాయి.


ఢిల్లి లిక్కర్‌ కుంభకోణం కావచ్చు..,టీఎస్పీఎస్సీ లో ప్రశ్నాపత్రాల లీకేజీ కావచ్చు.., విపక్షాలకు రాజ్యాంగ కల్పించిన హక్కుల నిరాకరణ కావచ్చు.., మరెన్నో అంశాలపై అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశాలు అందివచ్చాయి. వాటిపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు, ధర్నాలు, బంద్‌లు,నిరసనలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, సమస్యలపై పార్టీ శ్రేణులను కదిలించ డంలో పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విఫలమ య్యారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ పిలుపు ఇస్తే రంగంలోకి రావాలనుకునే పరిస్థితిలో ఎంతో కొంత కేడర్‌ ఉన్నప్పటికీ, వారికి పని జెప్ప డంలో విఫల మవుతోందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. పార్టీ సారథి షర్మిల పాదయాత్రలు, దీక్షలు చేపట్టిన సంద ర్భంగా పార్టీ యాక్టివ్‌లోఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ కార్య క్రమాలు లేని సందర్భర్భాల్లో కేవలం పత్రికా ప్రకటనలకే అది కూడ హైదరాబాద్‌లో షర్మిల ఇచ్చే ప్రకటనలకే పరిమి తమవుతోంది.

11 మంది అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ, ఎప్పుడో తప్ప వారు మీడియా సమావేశాలు నిర్వహించని పరిస్థితి ఉంది. పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యక్తిగతంగా ప్రజా సమస్య లపై ధైర్యంగా, దూకుడుగా వెళతారనే పేరు తెచ్చుకున్నారు. అనుకున్నది సాధించేందుకు మొండిగా ఎంత వరకైనా ముందుకు పోతారనే పేరుంది. కానీ, పార్టీ వరకు వచ్చే సరికి ఫెయిల్‌ అయ్యారనే చెప్పవచ్చు. పార్టీ శ్రేణులను కదిలించ డంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. తాను సొం తంగా చేపట్టే దీక్షలు, పాదయాత్ర ఇతర కార్య క్రమా లను విజ యవంతం చేస్తున్నప్పటికీ, నాయ కురాలిగా పార్టీ శ్రేణులతో జిల్లా, నియోజవక వర్గాల్లో కూడా ఆందోళనలు చేయిం చడంలో ,కదిలిం చడంలో విఫలమవుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటిం చారు. అక్కడ కూడా పార్టీ చురుకుగా లేని పరిస్థితి ఉందని అం టున్నారు. చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల మొదలుపెట్టినప్పుడు వైఎస్‌ ఆర్‌టీపీ ఒక ప్రభంజనం సృష్టిస్తుందనే అంచనాలు వేశారు. షర్మిల యాత్రలకు అశె షంగా ప్రజలు తరలివచ్చే వారు. కానీ, క్రమక్రమంగా ఆమె పాదయాత్రలకు వచ్చే జనం సంఖ్య తగ్గుతోందని ఆ పార్టీ కార్య కర్తలే చెబుతున్నారు. తన ప్రసంగాల్లో సమస్యలను ప్రస్తా వించడం ఆకట్టుకుంటు న్నప్పటికీ, చేస్తున్న ఘాటైన విమర్శలే ఆమెకు చేటుతెసు ్తన్నాయనే విమర్శ ఉంది.

వైఎస్‌ఆర్టీపీకి అన్ని పార్టీలకు ఉన్నట్లే జంబో కార్యవర్గం ఉంది. 186మందికి వివిధ పోస్టులు ఉన్నా యి. అందులో 11మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. జిల్లా స్థాయిలో అధ్య క్షులు, పరిశీలకులు, నియోజక వర్గ స్థాయిలో ఇంచార్జీలు, కోఆర్డినేటర్లు ఉన్నారు. అంతేగాక పార్టీకి రైతు, మహిళ, విద్యా ర్థి, కార్మిక తదితర అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement