శంషాబాద్ లో 2019 నవంబర్ 27లో జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అప్పుడే ఎన్ కౌంటర్ చేశారు.. ఈ ఎన్ కౌంటర్ పై కోర్టులో కేసు నడుస్తోంది. ఎన్ కౌంటర్ పై సిర్పూర్ కమిషన్ కూడా ఏర్పాటయింది. ఈ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహశీల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దని స్టే విధించింది.
Shamshabad – దిశ నిందితుల ఎన్ కౌంటర్ … పోలీసులపై చర్యలకు హైకోర్టు నో..
Advertisement
తాజా వార్తలు
Advertisement