Tuesday, November 19, 2024

TS: హుజురాబాద్ రూపురేఖలను తీర్చిదిద్దుతా.. పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్) : హుజురాబాద్ రూపురేఖలను తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రూ.10 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ రోడ్డులో రూ.25 లక్షలతో (స్ట్రాం వాటర్ డ్రైన్) మురికి కాలువల నిర్మాణానికి, సైదాపూర్ రోడ్డు నుండి వాటర్ ట్యాంక్ లకు వెళ్ళు మార్గంలో రూ.50 లక్షలతో HDPE పైప్ లైన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, వచ్చే ఐదేళ్లలో హుజురాబాద్ రూపు రేఖలను తీర్చిదిద్ది చూపిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో హుజరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్ తరహాలో తీర్చిదిద్ది చూపిస్తానన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, హుజరాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement