ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాకే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తేల్చిచెప్పారు.
అతని సమక్షంలో ప్రమాణం చేయను.. నాకు సిగ్గుంది. అంతకు మించిన అభిమానం ఉంది. నేను భారతీయుడిని“ అని రాజాసింగ్ అన్నారు.ఆది నుంచి కూడా ఎంఐఎంను వ్యతిరేకిస్తున్న బీజేపీ సబ్యుడు రాజాసింగ్ ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎన్నుకోవడం పట్ల కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆయన సమక్షంలో ప్రమాణం చేయబోనని వెల్లడించారు. అంతేకాదు.. తనలో భారతీయ రక్తం పారుతోందన్నారు.