హైదరాబాద్ లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారి ఎన్.హరిబాబుశర్మ తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయని చెప్పారు. అప్పుడు ఎండలో నిటారుగా ఉంచిన ఏ వస్తువు నీడ రెండు నిమిషాల పాటు అంటే 12:12 నుంచి 12:14 వరకు కనిపించదని పేర్కొన్నారు. మనం ఎండలో నిలుచున్నా.. మన నీడ సైతం కనిపించదని తెలిపారు. ఇదే విధంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని ఆయన వివరించారు. సమయంలో మార్పులతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ నీడ మాయం అవుతుందని తెలిపారు. కాగా, ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement