Wednesday, September 18, 2024

HYD: వనస్థలిపురంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై లైంగిక దాడి..

ఎల్బీనగర్ జులై 30, ఆంధ్ర ప్రభ : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి యశోద్రా నగర్ లోని బొమ్మరిల్లు గ్రాండ్ హోటల్ రూంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి(25)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన యువతి చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డి మరో స్నేహితుడితో కలిసి సోమవారం సాయంత్రం బాధితురాలు సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓంకార్ నగర్ లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ హోటల్ లో పార్టీ చేసుకునేందుకు రూంను అద్దెకు తీసుకున్నారు.

హోటల్లోని బార్ లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్ కి వెళ్ళారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్ లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది రూమ్ కు వెళ్లడంతో రూమ్ లోకి వెళ్ళి చూసే సరికి అప్పటికే ఆ ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండడంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి, అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement