Sunday, November 17, 2024

మైనర్‌ బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి ప‌దేండ్ల‌ జైలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మైనర్‌ బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. 2016లో హైదరాబాద్‌ – అంబర్‌పేట తులసీరామ్‌ నగర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడిన కేసులో అయ్యవారి సత్తిబాబు అనే నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పది సంవత్సరాల శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధించింది.

నిందితుడు అయ్యవారి సత్తిబాబు స్థానికంగా వాల్‌పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ 12 ఏళ్ళ బాలుడిని ఆవులను మేపుదాం అని చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి అసహజ లైంగిక దాడికి సత్తిబాబు పాల్పడ్డాడు. దీంతో బాధిత బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అంబర్‌పేట పోలీసులు సరైన ఆధారాలతో దర్యాప్తును పూర్తి చేసి చార్జ్‌షీట్‌ను కోర్టులో సమర్పించడంతో న్యాయమూర్తి ప్రేమలత నిందితుడికి శిక్ష ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement